ETV Bharat / state

తండ్రీకొడుకులను కలిపిన టిక్​టాక్​ - టిక్​ టాక్​ న్యూస్​

2018లో అదృశ్యమైన తండ్రిని కొడుకుల చెంతకు టిక్​టాక్​ కలిపింది. ఎక్కడ వెతికిన దొరకని తండ్రి... చివరకు టిక్​టాక్​ వీడియోలో వారికి కనిపించాడు. అలా తండ్రి కొడుకులను టిక్​టాక్​ కలిపింది.

missing father in tik tok video in badradri kothagudem district
తండ్రీకొడుకులను కలిపిన టిక్​టాక్​
author img

By

Published : May 24, 2020, 10:49 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రొడ్డం వెంకటేశ్వర్లు పుట్టుకతోనే దివ్యాంగుడు. 2018 ఏప్రిల్​ 27న కూలీ పనుల కోసం వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు అన్ని చోట్ల వెతికారు. కానీ అప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఆచూకీ దొరకలేదు. గ్రామానికి చెందిన ఓ యువకుడు టిక్‌టాక్ చూస్తుండగా వెంకటేశ్వర్లు కనిపించిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలిపాడు.

తండ్రీకొడుకులను కలిపిన టిక్​టాక్​

అసలేం జరిగిందంటే?

పంజాబ్‌లోని లుథియానాలో లాక్‌డౌన్‌లో ఆహార పంపిణీ టిక్‌టాక్‌ వీడియోలో వెంకటేశ్వర్లు కనిపించాడు.. పంజాబ్​ లూథియానాలో ఉన్నట్లు కుమారులు తెలుసుకున్నారు. వెంటనే వెంకటేశ్వర్లు కొడుకు కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ద్వారా అనుమతి పత్రం తీసుకుని ప్రత్యేక వాహనంలో రెండు రోజుల క్రితం పంజాబ్ వెళ్లాడు. అక్కడి పోలీసుల సహాయంతో తన తండ్రిని కలుసుకున్నాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోాయారు.

ఇదీ చూడండి: వలస కూలీలను పంపేందుకు చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.