భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంత్రులు సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్ సందర్శించాల్సిన పర్యటన రద్దయింది. ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన బాధితులను మంత్రులు పరామర్శించాల్సి ఉంది. కానీ మంత్రుల పర్యటన వల్ల ఆ గ్రామ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని భావించి... వారి పర్యటనను రద్దు చేసుకున్నారు.
బాధితులను కలెక్టరేట్‌కు రప్పించి పరామర్శించారు. మంత్రుల పర్యటనకు ముందు రోజు నుంచే గ్రామాల్లో నానా హంగామాతో వేదికను ఏర్పాటు చేయడాన్ని పలువురు విమర్శించారు.
ఇదీ చదవండి: నిరసనల్లో నారీభేరి- వెనక్కి తగ్గని మహిళా రైతులు