భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పాడుచెరువు సమీపంలో నిర్మిస్తున్న మినీట్యాంక్ బండ్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రూ. 337.58 లక్షల అగ్రిమెంట్ విలువతో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ నిధులతో 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు.
17 నెలలు కావస్తున్నా కరకట్ట అభివృద్ధి రహదారి పనులు అలాగే ఉన్నాయి. మరోవైపు పనుల్లో నాణ్యత సరిగా లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మినీ ట్యాంక్ బండ్ పనులు అట్టహాసంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు పనుల జాప్యంపై స్పందించడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం