భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా ప్రధాన ఆలయంలోని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో 1008 కలశాలతో అభిషేకం చేశారు.
వివిధ నదీ జలాలు, పాలు, తేనె, నెయ్యి, పంచోదకాలు, పంచామృతాలతో స్నపనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!