ETV Bharat / state

ఎలాగైనా మీరే మా వాళ్లను మా ప్రాంతానికి పంపండి - BHOOPALAPALLY DISTRICT

మా వాళ్లు మరణిస్తే పూడ్చిపెట్టే వాళ్లే లేరు. పెద్దోళ్లు మీరే ఎలాగైనా మావోళ్లను మా ప్రాంతాలకు పంపండి అంటూ వలస కూలీలు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సూరారం గ్రామంలో వలస కూలీలతో మంత్రి వేదిక ఏర్పాటు చేసి ముఖాముఖిగా సమస్యలు తెలుసుకున్నారు.

మీరే ఆదుకోవాలి మమ్మల్ని : వలస కూలీలు
మీరే ఆదుకోవాలి మమ్మల్ని : వలస కూలీలు
author img

By

Published : Apr 21, 2020, 6:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సూరారం గ్రామంలో వలస కూలీలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చర్చించారు. తొలుత మహారాష్ట్ర కూలీలతో వారి భాషలోనే సంభాషించారు. తమను స్వస్థలాలకు పంపించాలని కోరగా... మహారాష్ట్రలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని మంత్రి బదులిచ్చారు. మీరు ఇక్కడే భద్రంగా ఉండవచ్చని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. తాము చిన్న పిల్లలను వదిలేసి వచ్చామని... వారంతా ఏడుస్తున్నారని కూలీలు వాపోయారు.

మాకు పరీక్ష చేసి పంపండి సారూ !

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రితో మాట్లాడుతూ నా భర్త, నేను పనుల కోసమని పిల్లలను వదిలేసి వచ్చామని మంత్రి దృష్టికి తెచ్చారు. తన మామ చావు బతుకుల్లో ఉన్నాడని, వెళ్లకుంటే పూడ్చేవారే లేరంటూ ఆమె కన్నీటి పర్యంతమయింది. మాకు పరీక్షలు చేసి పంపండి సారూ అంటూ వేడుకుంది. స్పందించిన మంత్రి పువ్వాడ... సమస్యను పరిష్కరించాలని కలెక్టర్​ను ఆదేశించారు. కొంత మంది తెలంగాణ కూలీలకు బియ్యం, నగదు అందలేదని చెప్పడం వల్ల అధికారులను మంత్రి ప్రశ్నించారు. లాక్‌ డౌన్‌ ముగిసే వరకు కూలీలను రైతులు, అధికారులు కంటికి రెప్పలా చూసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్‌, కలెక్టర్‌ ఎంవీరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య, పాల్గొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.