భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు మిలీషియా సభ్యులు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఎదుట లొంగిపోయారు. చర్ల మండలంలోని చెన్నాపురం గ్రామానికి చెందిన వారని ఏఎస్పీ పేర్కొన్నారు. వీరు గత మూడు సంవత్సరాలుగా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెన్నాపురం గ్రామ కమిటీ సభ్యులుగా, మిలీషియా సభ్యులుగా పనిచేశారన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాల్లో వీరిపై కేసులు ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. మావోయిస్టులు అమాయక గిరిజనులు, ప్రజల పట్ల అవలంభిస్తున్న విధానాల వల్ల విసుగు చెంది లొంగిపోయినట్లు ఏఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా ఇల్లు లేదు