భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామం వద్ద మావోయిస్టు కొరియర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు రేగుబల్లి గ్రామంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు వాహన తనిఖీలు చేస్తుండగా భద్రాచలం వైపు నుంచి దుమ్ముగూడెం వైపుకు అనుమానాస్పదంగా ఒక ట్రాక్టర్ వస్తుండగా పోలీసులు ఆపారు.
పోలీసులను చూసి పారిపోతుండగా ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు దుమ్ముగూడెం ఎస్సై రితీష్ తెలిపారు. ట్రాక్టర్‌ను తనిఖీ చేయగా పేలుడు పదార్థాలను గుర్తించారు.
చత్తీస్‌గఢ్‌లోని చంద్రగూడెం గ్రామానికి చెందిన మీడియం జోగారావు చాలా సంవత్సరాల నుంచి మావోయిస్టు కొరియర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు కూడా పేలుడు పదార్థాలు మావోయిస్టులకు అప్పగించేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 25 జిలెటిన్ స్టిక్స్, 100 మీటర్ల కార్ డెక్ వైరు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొరియర్ జోగారావును అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఇవీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న పేలుడుపదార్ధాలు స్వాధీనం