భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భద్రాచలంలో 43 మంది మహిళలకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పొదెం వీరయ్య అందజేశారు. చెక్కులను లబ్ధిదారులకు ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఒక్కొక్కరి దగ్గరి నుంచి మూడు వేల నుంచి ఐదువేల వరకు నగదు వసూలు చేశారని లబ్ధిదారులు ఎమ్మెల్యేతో విన్నవించుకున్నారు. దానిపై స్పందించిన వీరయ్య లబ్ధిదారులు చెక్కుల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: మద్దతు పెరుగుతోంది... సమ్మె ఉద్ధృతమవుతోంది