భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దేవిశరన్నవరాత్రి మహోత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. ఈఉత్సవాల్లో లక్ష్మీతాయారు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
కొవిడ్ నిబంధనల్లో భాగంగా మహిళా భక్తులను పరిమిత సంఖ్యలో కుంకుమ పూజకు అనుమతించారు. ఆదిలక్ష్మీ అమ్మవారికి ఆలయ అర్చకులు ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం