భద్రాద్రి కొత్తగూడం జిల్లా ఇల్లందులోని జీఎం కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కొన్ని బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రైవేటీకరణ చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలను ఆపివేసి.. సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని వారు జీఎం సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ ఆపాలని... లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేసి సమ్మె చేపడతామన్నారు.