'కుమురం భీం భావితరాలకు మార్గదర్శకుడు' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కుమురం భీం 80వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసీ సంఘాల జేఏసీ అధ్వర్యంలో కొత్త బస్టాండ్లో ఉన్న కుమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుమురం భీం పోరాట పటిమను చూపారని నాయకులు కొనియాడారు. భావితరాలకు భీం మార్గదర్శకుడిగా నిలుస్తారని నాయకులు సూచించారు.
'కుమురం భీం భావితరాలకు మార్గదర్శకుడు'