భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండంలోని కిన్నెరసాని వీఆర్వో పద్మను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ మహిళ కల్యాణ లక్ష్మి పథకాన్ని మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లింది. మంజూరు చేయాలంటే పదివేలు లంచం ఇవ్వాలని వీఆర్వో పద్మ డిమాండ్ చేసింది.
బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో పద్మ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇవీ చూడండి: అమెజాన్‌లోనూ ఇక మద్యం హోం డెలివరీ!