భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రముఖ ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస రావు(వాసు) కరోనాతో మృతి చెందడంతో ఆయన అంతిమ సంస్కారాలను అన్నం ఫౌండేషన్ నిర్వహించింది. పారా లీగల్ వాలంటీర్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఇల్లందు పట్టణంలో దశాబ్దాలుగా ప్రైవేటు విద్యాసంస్థల్లో భాగస్వామి, ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శ్రీనివాసరావు.. గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. కొవిడ్ నిబంధనలతో అన్నం ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించింది.
జులై 2 వ తేదీన ఇల్లందు పట్టణంలో మొదటి అంత్యక్రియలు నిర్వహించామనీ, కరోనా సోకిన వారికి ధైర్యం చెబుతూ వారికి మానసిక ఉత్సాహం ఇవ్వాలని ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు అన్నారు. తాను కూడా ఈ మహమ్మారి బారిన పడ్డానని కొవిడ్ మృతులకు వారి సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్