భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో జరుగుతున్న సీతారామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రజత్ కుమార్ పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో అశ్వాపురం చేరుకున్న రజత్‌కుమార్ అధికారులతో కలిసి దుమ్ముగూడెం ఆనకట్ట, సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
30రోజుల్లో సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌రన్ నిర్వహించేందుకు కృషిచేస్తున్నట్లు రజత్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని... వాటన్నిటినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అనంతరం భారజల కర్మాగారం అతిథిగృహంలో రాష్ట్రంలో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై రజత్‌కుమార్ సమీక్షాసమావేశం నిర్వహించారు.