మావోయిస్ట్ దళ సభ్యురాలు మడివి అడిమే లొంగిపోయినట్లు భద్రాచలం ఏఎస్పీ డా. వినీత్ తెలిపారు. చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన అడిమే.. 2016 నుంచి మావోయిస్ట్ దళంలో పనిచేస్తుట్లు ఆయన తెలిపారు. అనేక సార్లు పోలీసు వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పారితోషకాన్ని ఇప్పించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
జనజీవన స్రవంతిలోకి రండి
మావోయిస్టు జీవితంపై విరక్తి చెందడం వల్లే జనజీవన స్రవంతిలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. మిగతా సభ్యులు కూడా దండ కారణ్యాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.
ఇదీ చదవండి:'కేసీఆర్ వల్లే కరెంటు, సాగునీటి కష్టాలు తీరినయ్'