కొవిడ్ సంక్షోభంలో.. నర్సుల సేవలు మరువలేనివని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్ పేర్కొన్నారు. ఇల్లందు ప్రభుత్వాసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వైద్య సిబ్బందిని సన్మానించి.. మిఠాయిలు పంచారు.
ఆపత్కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా నర్సులు అందించిన సేవలు ఎనలేనివని రాజేందర్ అన్నారు. కొవిడ్ బాధితులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ.. చికిత్సలు నిర్వహించడం అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'