భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల నీటిమట్టం పెరుగుతోంది. ఈరోజు ఉదయం 23 అడుగులు ఉన్న నీటినిల్వ.. సాయంత్రం 6 గంటలకు 38 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. బురదను శుభ్రం చేసేందుకు ఉపయోగించే మోటార్లు వరద నీటిలో మునిగిపోయాయి. గజ ఈతగాళ్ల సహాయంతో మోటార్లను బయటకు తీశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నందున భద్రాచలంలో ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం