ETV Bharat / state

భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు అంకురార్పణ చేశారు ఆలయ అర్చకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరగనున్న సీతారాముల తిరుకల్యాణ మహోత్సవానికి ముందుగా తీర్థబిందెను తీసుకొచ్చి పుణ్యాహవచనం నిర్వహించారు.

bhadradri
భద్రాద్రి రామయ్య
author img

By

Published : Apr 17, 2021, 10:40 PM IST

శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈనెల 21న జరగనున్న సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవానికి అంకురార్పణ నిర్వహించారు ఆలయ అర్చకులు. వేడుకల్లో ముందుగా తీర్థబిందెను తీసుకువచ్చి పుణ్యాహవచనం చేశారు. అనంతరం దీక్ష వస్త్రాలు పంపిణీ చేశారు. రాములవారికి కంకణ ధారణ చేశారు.

సాయంత్రం పుట్టమన్ను సేకరించిన అర్చకులు పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రదక్షిణ చేసి వాస్తు హోమం చేపట్టారు. హోమశాలలో అంకురార్పణ చేసి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులు ప్రారంభించారు. ఆదివారం ధ్వజపటం, చిత్రలేఖనం నిర్వహించనున్నట్లు ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీమాన్​ తెలిపారు.

ఇదీ చూడండి: నోడ్యూ సర్టిఫికెట్లు తప్పనిసరి కాదు: ఎన్నికల సంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.