ETV Bharat / state

తెరాసకు తెరాసతోనే పోరు...! - MUNICIPALITY ELECTIONS 2020

బల్దియా ఎన్నికల్లో వివిధ పక్షాలకు సొంత పార్టీనుంచి రెబల్స్ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. ఇల్లందు పురపాలికలో అధికార తెరాసకు మాత్రం ఒక్కో వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు ఆశావాహులు పోటీపడుతున్నారు. సొంత పార్టీ అభ్యర్థులే ముంచుతారన్న భయం గులాబీ పార్టీకి పట్టుకుంది. స్థానిక ఎన్నికలు కాబట్టి రెబల్ అభ్యర్థులను విరమింపచేయటం అంత తేలికకూడా కాకపోవటం వల్ల నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ILLENDU TRS MUNICIPALITY ELECTIONS
తెరాసకు తెరాసతోనే పోరు...!
author img

By

Published : Jan 14, 2020, 6:00 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పురపోరు రసవత్తరంగా మారింది. మున్సిపాలిటీలోని 24వార్డుల్లో 422 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 270 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. దాదాపుగా ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావాహులు పోటీలో నిలబడ్డారు.

టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​కు తాజా మాజీ ఛైర్మన్ వెంకట్ రమా గౌడ్ వర్గాల మధ్య వర్గ పోరుతో ఇల్లెందులో తెరాస రాజకీయం రంజుగా మారింది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చామంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మొత్తంగా తెరాసకు తెరాసతోనే పోరు అన్నట్లుగా సాగుతున్న ఇల్లెందు గులాబీ రాజకీయాలపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న కథనం.

తెరాసకు తెరాసతోనే పోరు...!

ఇవీచూడండి: పురపాలికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.