భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ప్రాంతంలోనూ కరోనా కేసులు పెరుగుతుండడంపై అధికారులు చర్యలు చేపట్టారు. కార్మికులు శుభ కార్యాలయాలకు 20 మందితో మాత్రమే నిర్వహించుకోవాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. శుభ కార్యాలయాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మాస్కులు ధరిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..