కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
పురపాలక ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 24 వార్డులకు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మెప్మా సిబ్బందితో 24 కమిటీలు వేశారు. ఇంటింటి సర్వే నిర్వహించి కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి.. మాత్రలు వేసుకునే విధానాన్ని తెలియజేయనున్నారు. తహసీల్దార్ కృష్ణవేణి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఉన్నా వ్యాక్సినేషన్ ఆగొద్దు: మోదీ