భద్రాద్రి రామయ్య సన్నిధిలో(Bhadradri temple news) భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక మాసం... పైగా ఆదివారం సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.
పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి... స్వామివారి ఆలయంలో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. రామయ్య నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం వేకువజామునే ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంతాలన్నీ భక్తజన సందోహంతో కళకళలాడుతున్నాయి. భక్తులు వెలిగించిన కార్తిక దీపాలు.. వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ కాంతులతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది.
ఇదీ చదవండి: Karthika Deepothsavam: ఆదిలాబాద్లో ఆధ్యాత్మికం.. కన్నుల పండువగా కార్తిక దీపోత్సవం