BHADRADRI TEMPLE: ఆదివారం కావడంతో భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. లక్ష్మణ సమేత సీతారాముల మూల మూర్తులకు పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
స్వామివారికి విశేష పూజల సమయంలో భక్తులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ఇదే సమయంలో కొందరు ఆలయ సిబ్బంది వెనక ద్వారం నుంచి భక్తులను అనుమతించడం విమర్శలకు తావిస్తోంది.
భక్తులకు ఆలయ సిబ్బందికి మధ్య వాగ్వాదం
![Crowds of devotees in the culinaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14783502_bline.png)
దర్శనానికి 300 నుంచి 500 టిక్కెట్లు కొనుక్కుని ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి చూస్తుండగా.. వెనక నుంచి వచ్చిన భక్తులను దర్శనాలకు ఎలా పంపిస్తారని కొందరు భక్తులు ఆలయ సిబ్బందిని నిలదీశారు. సరైన వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. అధికారులు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే భక్తులకు ఇబ్బందులు ఉండవని సూచించారు.
ఇదీ చదవండి: YADADRI TEMPLE: యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ