ETV Bharat / state

ఫిర్యాదు చేసినందుకు చితకబాదిన వార్డెన్

వసతులు సరిగా లేవని అడిగినందుకు హాస్టల్ వార్డెన్​... ఓ విద్యార్థిని చితకబాదిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

ఫిర్యాదు చేసినందుకు చితకబాదిన వార్డెన్
author img

By

Published : Aug 19, 2019, 5:05 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సీ బాలుర వసతిగృహం వార్డెన్... ఓ విద్యార్థిని కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరకగూడెం మండలం బట్టుపల్లికి చెందిన సందీప్​ అనే విద్యార్థి వసతిగృహంలో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. అనారోగ్యం కారణంగా... ఈ నెల 1న ఇంటికి వెళ్లి, 16న తిరిగి హాస్టల్​కు వచ్చాడు. అదే రోజు సాయంత్రం తనిఖీ చేసేందుకు వచ్చిన సాంఘిక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లుకు... ఆహారం, సౌకర్యాలు సరిగా లేవని ఫిర్యాదు చేశాడు. సందీప్​పై కోసం పెంచుకున్న వార్డెన్ శ్రీనివాస రావు ఈ నెల 17న గదిలో పెట్టి తీవ్రంగా కొట్టి, గుంజీలు తీయించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు వార్డెన్​పై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఫిర్యాదు చేసినందుకు చితకబాదిన వార్డెన్

ఇదీ చూడండి: సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి

Intro:వసతి గ్రహంలో ఉండే బాలుడిని కొట్టిన వార్డెన్

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉండే 8 వ తరగతి బాలుడిని హాస్టల్ వార్డెన్ ని కొట్టిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి బాలుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన సందీప్ మనుగూరులోని ఎస్సీ బాలుర వసతిగృహంలో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 1వ తేదీన సందీప్ అనారోగ్యానికి గురై ఇంటికి వెళ్ళాడు. జ్వరం తగ్గిన తర్వాత సందీప్ ఈనెల 16వ తేదీన వసతి గృహానికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం వసతి గృహాన్ని తనిఖీ చేసేందుకు సోషల్ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వసతి గృహంలో సరైన సౌకర్యాలు, ఆహారం సరిగా ఉండటం లేదని సందీప్ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై హాస్టల్ వార్డెన్ శ్రీనివాస రావు సందీప్ పై కోపం పెంచుకుని మే 17వ తేదీన వసతి గృహంలో ఒక గదిలో ఉంచి కొట్టి, 70 గుంజీళ్లు తీయించాడ్.

Conclusion:సందీప్ ను కొట్టి ,గుంజీళ్లు తీయించిన విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావుని ప్రశ్నించేందుకు వసతి గృహానికి వచ్చారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని తల్లిదండ్రులు తెలిపారు.

stringer: naresh
cell:9121229033.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.