ETV Bharat / state

ఆ జిల్లాల్లో ప్రమాద ఘంటికలు.. ఇలాగైతే.. ఎలా పీల్చగల'గాలి'

author img

By

Published : Nov 29, 2022, 7:29 AM IST

కాలుష్యం అనగానే హైదరాబాద్‌ వంటి మహానగరాల పేరే గుర్తుకు వస్తుంది. కానీ ఇతర నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) తాజా గణాంకాల ప్రకారం ఆరేళ్ల వ్యవధిలో కాలుష్యం ఆందోళన స్థాయికి చేరిన వాటిల్లో ఖమ్మం, కొత్తగూడెం కూడా ఉన్నాయి.  ఇవేకాక ఇతర పట్టణాల్లోనూ వాయు కాలుష్యం ఏటేటా పెరుగుతోంది. యావత్‌ సమాజ చైతన్యమే ‘ఉక్కిరిబిక్కిరి’  చేసే సమస్య నుంచి బయట పడేస్తుంది.

ఇలాగైతే.. ఎలా పీల్చగల'గాలి'
ఇలాగైతే.. ఎలా పీల్చగల'గాలి'

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాల్లో కాలుష్యం పలు కారణాలతో అధికంగా నమోదవుతోంది. శ్వాసకోశ సంబంధ రోగాలతో బాధపడేవారి సంఖ్య ఇతర జిల్లాలతో పోల్చిచూస్తే అధికం. ఏటా వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నాశనమవుతున్నాయి. అయినా నివారణ చర్యలు కంటితుడుపుగా మిగులుతున్నాయి. పరిస్థితిని పరిశీలిస్తే..

పరిశ్రమలు..: పాల్వంచలో నాలుగైదు భారీ పరిశ్రమలు, పదుల సంఖ్య చిన్నతరహా పరిశ్రమలున్నాయి. ఉత్పత్తుల తయారీలో, షట్‌డౌన్‌ సమయాల్లో పరిశ్రమల గొట్టాల నుంచి దట్టమైన పొగ వస్తోంది. ఆ సమయంలో గాలివాటం ఎటు వైపు ఉంటే అటు బూడిద, ఇతర రసాయనాలు వాతావరణంలో వెదజల్లుతున్నాయి. విద్యుత్తు ఉత్పత్తి సంస్థ కారణంగా పాల్వంచ, మణుగూరు మండలాల్లో పదుల సంఖ్యలోని గ్రామాల్లో వందల ఎకరాల పొలాలు సాగు యోగ్యతకు నోచుకోవడంలేదు.

చెత్త కాల్చివేత..: కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, సత్తుపల్లి, మధిర పురపాలికల పరిధిలో ఇంటింటికీ చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతోంది. ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా పేరుకుపోయే వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌ యూనిట్లు ఖమ్మం, కొత్తగూడెంలో మాత్రమే ఉండగా.. అవీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. నగర/పురపాలకాల్లో రోజుకు 238 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో సుమారు 40 మె.ట. కాల్చివేస్తున్నారు.

పాత వాహనాలు..: కాల పరిమితి ముగిసిన వాహనాలు పొగ బండ్లుగా మారినా పట్టణాల్లో యథేచ్ఛగా నడుపుతున్నారు. కాలం చెల్లిన వాటిల్లో గత మూడేళ్లలో 2,148 ద్విచక్రవాహనాలు, 574 ఆటోలు, 51 కార్లు, 69 ట్రాక్టర్లు, 37 బస్సులు, 82 లారీలను స్వాధీనం చేసుకున్నారు.

బొగ్గు గనులు..: సింగరేణి ఓసీ పేలుళ్లు, బొగ్గు రవాణా కారణంగా సత్తుపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం, మణుగూరుల్లో దుమ్ము, ధూళి ఎగసిపడుతోంది. గనుల్లో వెలువడే ధార్మికశక్తితో పరివాహక ప్రాంతాల వారికి చర్మవ్యాధులు, ప్రాణాంతక క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది.

అధ్వాన రహదారులు..: ఖమ్మం-ఇల్లెందు, ఖమ్మం-నేలకొండపల్లి, కొత్తగూడెం-ఇల్లెందు, కొత్తగూడెం-ఖమ్మం, పాల్వంచ-సత్తుపల్లి సహా జిల్లా మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు పలు చోట్ల గుంతలమయంగా మారాయి. నిత్యం దుమ్ము, ధూళి ఎగిసిపడుతోంది. పీఆర్‌, ఇతర రోడ్లదీ ఇదే పరిస్థితి. ఖమ్మం, కొత్తగూడెం మినహా మిగతా పట్టణాల్లో దుమ్ము శుభ్రం చేసే యంత్రాలు అందుబాటులో లేవు.

...

నియంత్రణ చర్యలు..

* పరిశ్రమల ఆవరణ, ప్రభావిత ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటించాలి.

* అత్యాధునిక సాంకేతికత వినియోగం, సకాలంలో వార్షిక మరమ్మతులు చేపట్టడం ద్వారా పరిశ్రమలు, కర్మాగారాల నుంచి వెలువడే ఉద్గారాల స్థాయిని తగ్గించాలి.

* వాహన కాలుష్యం అనర్థాలపై పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలి.

* పురపాలకాల్లో రహదారుల శుభ్రత, నిర్వహణ సక్రమంగా చేపట్టాలి. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సజావుగా జరగాలి.

* అవసరమైతే తప్ప ఇంధనంతో నడిచే కార్లు, ద్విచక్రవాహనాలతో రోడ్లపైకి రాకుండా చైతన్యం పెంపొందించాలి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై దృష్టిమళ్లించాలి.

* గనులు, క్వారీలు, స్టోన్‌క్రషర్ల నిర్వహణపై పర్యవేక్షణ చేపట్టాలి. లోడు వాహనాలు రోడ్లపై దుమ్ము, ధూళి వెదజల్లకుండా కట్టడి చేయాలి.

‘పాల్వంచ, కొత్తగూడెంలో భారీ పరిశ్రమలతో కాలుష్య ముప్పు పొంచిఉంది. మహానగరాలతో పోల్చితే ఇక్కడే ప్రమాదకరంగా కనిపిస్తుంది. అయినా ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటు లేదు. క్రమంగా జంట పట్టణాలు రెడ్‌జోన్‌లోకి చేరాయి. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా చూడాలి. సామాజిక అడవులు పెంచేలా రైతులకు ఆర్థిక చేయూతనివ్వాలి.’ - రమేశ్‌ రాథోడ్‌, గ్రీన్‌ఎర్త్‌ సొసైటీ వ్యవస్థాపకుడు, పాల్వంచ

ఇవీ చూడండి..

రాష్ట్రంపై పంజా విసురుతున్న 'చలి' పులి..

యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు దేశ కీర్తిప్రతిష్టను పెంచుతుంది: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.