భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల గుంపు వద్ద ఇసుక గుండాల వాగు పొంగి ప్రవహించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాగులోకి వరద నీరు పోటెత్తింది. దీంతో తుమ్మలచెరువు, వెంకటాపురం, మొండికుంట గ్రామపంచాయతీ పరిధిల్లోని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
భారీ వర్షానికి మణుగూరు పట్టణంలోని రహదారులపై నీళ్లు నిలిచాయి. కరోనా తీవ్రత దృష్ట్యా పట్టణ పరిధిలోని కూరగాయల మార్కెట్‌ను స్థానిక పాఠశాలకు తరలించగా.. వాన నీటితో మార్కెట్ పూర్తిగా నిండిపోయింది. దీంతో అక్కడి వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి: Heavy rains: ఆగమనానికి ముందే ముంచెత్తిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం