బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వాన కురుస్తోంది. పలు పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ వర్షం ఏకధాటిగా కురుస్తున్నందున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎడతెరిపి లేని వర్షం కారణంగా కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంవీవీ రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో ఉదయం నుంచి భారీ వర్షం