ETV Bharat / state

భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం - భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్​లో 244 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు భద్రాచలం పోలీసులు తెలిపారు.

marijuana in Bhadrachalam
భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం
author img

By

Published : Feb 28, 2020, 8:00 PM IST

భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్​లో 244 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్​ చంద్ర తెలిపారు. బస్టాండ్​లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఐదుగురు అనుమానితులు గుర్తించారు. వారి నుంచి 244 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి విలువ రూ. 36 లక్షలు ఉంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని సీలేరు నుంచి భద్రాచలం మీదుగా పంజాబ్​కు రవాణా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. రవాణా చేస్తున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా రాజస్థాన్​కు చెందిన వారని ఏఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.