హరిత హారంలో సింగరేణి పెద్ద పాత్ర పోషించటం సంతోషించదగ్గ విషయమని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్-4 గని డంప్యార్డ్పై హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రంజిత్ కుమార్ షైనీ, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ