ETV Bharat / state

కరోనా మృతదేహాన్ని కర్రకు కట్టి... అర కిలోమీటరు తీసుకెళ్లి... - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్​ మహమ్మారి మానవ సంబంధాలను పాతరేస్తోంది. కొవిడ్​ మృతుల పట్ల కనీస మానవత్వం కరవైంది. కుటుంబ సభ్యులు పట్టించుకోని ఓ వృద్ధురాలి మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్​ సభ్యులు సుమారు అరకిలోమీటరు దూరం మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

Telangana news
Khammam news
author img

By

Published : May 24, 2021, 10:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మోట్లగూడెం గ్రామానికి చెంది రామ భద్రమ్మ(60) కొవిడ్​తో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులు కానీ బంధువులు కానీ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఖమ్మం అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం పారా లీగల్ వాలంటీర్ అన్నం శ్రీనివాసరావు మరో వాలంటీర్ సత్యంతో కలిసి వచ్చారు. మృతదేహాన్ని ఒక కర్రకు కట్టి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసినప్పటికీ ఎవ్వరూ సాయం చేయలేదు.

సుమారు అర కిలోమీటరు మృతదేహంతో నడిచి మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్​ పట్ల ఎంతలా అవగాహన కల్పిస్తున్న మానవత్వం లేకుండా సహకరించకపోవడం బాధాకరమని అన్నం శ్రీనివాసరావు అన్నారు.

ఇదీ చూడండి: పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.