భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉదయం ఐదు గంటలకే స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయినాథున్ని అలంకరించి హారతి ఇచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదానం... సాయంత్రం పల్లకి సేవ నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయినాథున్ని దర్శనం చేసుకొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి