ETV Bharat / state

రామయ్యకు కానుకగా 11 కిలోల వెండి సింహాసనం

భద్రాచలంలోని శ్రీ రామచంద్రుడికి గుంటూరుకు చెందిన ఓ భక్తుడు వెండి సింహాసనాన్ని కానుకగా సమర్పించుకున్నాడు. 11.30 కిలోల వెండితో తయారు చేయించినట్టు ఆ భక్తుడు తెలిపాడు.

Guntur devotee who gave 11 kg silver throne to Bhadradri Ramaiah
రామయ్యకు కానుకగా 11 కిలోల సింహాసనం
author img

By

Published : Feb 22, 2020, 12:24 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామికి గుంటూరుకు చెందిన భక్తులు వెండి సింహాసనాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరుకు చెందిన రామకృష్ణ ఆర్య మంజుల దంపతులు ఈ సింహాసనాన్ని స్వామివారి సన్నిధిలో అందించారు.

టేకుతో తయారుచేసిన ఆసనానికి 11.30 కిలోల వెండి తాపడాన్ని అమర్చి ప్రత్యేకంగా తయారు చేయించారు. అమ్మవారు కూర్చునే విధంగా తయారు చేయించిన ఈ సింహాసనం విలువ సుమారు రూ. ఏడున్నర లక్షలు ఉంటుందని వారు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.