భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు 4వ వార్డులోని పేదలకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకుంటోందని ఆమె అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జాయిగూడెంలోని 36 మంది ఇటుక బట్టీల కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ చేశారు.
పట్టణంలోని పేదలకు జిల్లా అడిషనల్ ఎస్పీ డీఏఆర్ కిష్టయ్య ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వివిధ కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, సీఐ వేణు చందర్, తహసీల్దార్ మస్తాన్రావు, కౌన్సిలర్ అజాం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.