ETV Bharat / state

భద్రాచలంలో 50.5 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

నిన్నటి వరకు క్రమంగా తగ్గిన గోదావరి నీటిమట్టం... ఈరోజు మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద హెచ్చరికలు ఒక్కోటి ఉపసంహరించుకున్న అధికారులు ఇవాళ మళ్లీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు 50.5 అడుగులకు చేరగా... రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

godhavari-flood-level-increasing-at-bhadrachalam

author img

By

Published : Aug 20, 2020, 7:17 PM IST

భద్రాచలంలో వరద ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గోదావరి నీటిమట్టం 50.5 అడుగులకు చేరింది. మధ్యాహ్నం వరకు 48 అడుగులకు నీటి మట్టం పెరగ్గా.. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇంకా నీటి మట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్నారు. గత రెండు రోజుల నుంచి రామాలయం సెంటర్​లో గల అన్నదాన సత్రంతో పాటు చాలా దుకాణాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి.

ఇంకా పెరుగుంతుందని అంచనా...

భద్రాద్రి రామయ్య సన్నిధి తూర్పు మెట్ల వద్ద వరద పోటెత్తుతోంది. భద్రాచలంలోని ఏజెన్సీ మండలాలకు నాలుగు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు పెరగటం వ్లల ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. గత రాత్రి నుంచి భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల భద్రాచలంలో ఇంకా గోదావరి నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

జోరు వర్షాలతో ఏజన్సీ ప్రాంతాలు అతలాకుతలం...

గోదావరి తీరం వెంట జోరుగా వర్షాలు కురవడం, కాళేశ్వరం, ఇంద్రావతి, పేరూరు వైపు నుంచి భారీగా వరద చేరడం వల్ల భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతుంది. నీటిమట్టం మళ్లీ పెరుగుతుండగా... అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యసవసరం ఉన్నవారికి సాయం చేస్తున్నారు. ఓ వైపు భారీ వర్షాలు కురవడం, మరోవైపు గోదావరికి వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ మండలాలు మరోసారి అతలాకుతలమయ్యాయి. చర్ల, దుమ్ముగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఆళ్లపల్లి మండలాలు వరదలు, భారీ వర్షాల ధాటికి విలవిలలాడాయి. మణుగూరు పట్టణాన్ని భారీ వర్షం ముంచెత్తింది.

వరదగుప్పట్లో గ్రామాలు... నిలిచిపోయిన రాకపోకలు..

మణుగూరు పట్టణానికి సమీపంలో ఉన్న కట్టువాగు, మెట్లవాగు, కోడిపుంజుల వాగులు ఉప్పొంగి పలు కాలనీల్లోకి నీరు చేరింది. సుందరయ్య నగర్, ఆదర్శ నగర్, కాళీమాత ప్రాంతం, మేదరబస్తీ, సమితి సింగారం, కాలనీలు వరదగుప్పిట్లో చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్టారు. అశ్వాపురం మండలం మరోసారి వర్షం, వరదలతో వణికిపోయింది. పలు వాగులు పొంగి 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మణుగూరు-భద్రాచలం మార్గంలో వాగులు పొంగి రాకపోకలు నిలిచాయి. బట్టీలగుంపు, అమ్మగారి పల్లి, అమిర్దా, చింతిర్యాల, ఆనందపురం, నెల్లిపాక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరద ధాటికి వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. గుండాల మండలం మరోసారి జలదిగ్భంధంలో చిక్కుకుంది. మండలంలోని కిన్నెరసాని, మల్లన్నవాగు, ఎదర్రేవు, ఏడుమెలి కల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. చర్ల మండలంలోని ఈతవాగు వంతెన ఉప్పొంగి 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాాయి.

తాలిపేరుకు పోటెత్తిన వరద...

తాలిపేరు జలాశయానికి మరోసారి వరద పోటెత్తుతోంది. జలాశయం మొత్తం 25 గేట్లు ఎత్తి లక్షా 83 వేల క్యూసెక్కుల నీరు దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. 60 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతుండగా... 12 గేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.