భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలంలో నీటిమట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు వెల్లడించారు. 2 రోజుల క్రితం 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం... మంగళవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. బుధవారం ఉదయం ఆరు గంటలకు 27.7 అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల భద్రాచలంలో ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'