ETV Bharat / state

సంక్షేమ శాఖే పునాది.. గిరిపుత్రులకు ఉపాధి - గిరిజనుల అభివృద్ధి

అడవుల నుంచే లభించే ఉత్పత్తులే వారికి జీవనోపాధి.. సమాజానికి దూరంగా ఉంటూ ప్రకృతి ఒడిలో నివాసముంటూ అనేక ఆర్థిక ఇబ్బందులెదుర్కుంటున్న వారి అభివృద్ధే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ ముందుకొచ్చింది. ఇటీవల రసాయనాలు లేని సౌందర్య ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరగడం వల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో సబ్బులు, శాంపులు తయారుచేయడాన్ని గిరిజన మహిళలకు నేర్పించి వారికి ఆదాయ మార్గాన్ని చూపించింది.

girijana people empowerment in bhadradri kothagudem
సంక్షేమ శాఖే పునాది.. గిరిపుత్రులకు ఉపాధి
author img

By

Published : Jan 18, 2020, 10:54 AM IST

ప్రకృతిని అవపోసన పోసుకుని.. అడవుల ఉత్పత్తులే జీవనంగా జీవిస్తున్న ఆదివాసీలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని దూరం చేస్తూ గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించి... వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజన సహకార సంస్థ ప్రాంగణంలో రూ.25 లక్షల పెట్టుబడితో దమ్మక్క లియబులటీ అనే సబ్బులు, షాంపుల కంపెనీ ప్రారంభించారు.
ప్రకృతి సిద్ధం.. ఆరోగ్యకరం అన్న నినాదమే లక్ష్యం
ఇక్కడ ఎంతోమంది గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆసక్తి ఉన్న వారికీ హైదరాబాద్​లో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం ఆరు రకాలైన కలబంద, నారింజ, బొప్పాయి, వేప, తేనె, తులసిలతో సబ్బులు.. కలబంద శాంపులు తయారు చేస్తున్నారు. వీటిని గిరిజన సంక్షేమ శాఖ ద్వారానే ఆశ్రమ పాఠశాలలకు అందిస్తున్నారు. ఆర్డర్​పై మార్కెట్లోనూ అమ్ముతున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే లభించడం వల్ల గిరాకీ బాగానే ఉంది.
గిరిజనులను సమానంగా చూడటంతో పాటు వారికి అన్ని రంగాల్లోనూ అవకాశం కల్పించేందుకు ఆ శాఖ అధికారులు చేస్తున్న కృషిని అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని గిరిపుత్రులు కోరుతున్నారు.

సంక్షేమ శాఖే పునాది.. గిరిపుత్రులకు ఉపాధి

ఇవీ చూడండి: తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక?

Intro:ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించి... వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో గిరిజన సహకార సంస్థ ప్రాంగణంలో దమ్మక్క లియబులటీ అనే సబ్బులు షాంపులు కంపెనీని ప్రారంభించారు...

Body:ఇటీవల రసాయనాలు లేని సౌందర్య ఉత్పత్తులకు గిరాకి బాగా పెరిగింది .ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కలబంద, తులసి, వేప ...వంటి పదార్థాలతో సబ్బులు, శాంపులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు ..25 లక్షల పెట్టుబడితో దీన్ని స్థాపించారు .
చాలా మంది గిరిజన మహిళలు దీనిలో ఉపాధి పొందుతున్నారు .వీటి తయారీ పై వీరందరికీ హైదరాబాదులో లో శిక్షణ ఇచ్చారు .వీరు తయారు చేసిన ఉత్పత్తులను గిరిజన సంక్షేమ ద్వారా ఆశ్రమ పాఠశాలలకు అందిస్తున్నారు .అంతేకాకుండా ఆర్డర్ పై వస్తువులను మార్కెట్లో లో అమ్ముతున్నారు .ఆరు రకాలైన కలబంద, నారింజ ,బొప్పాయి, వేప, తేనె ,తులసిలతో సబ్బులు.. వీటితోపాటు కలబంద శాంపుల్ తయారు చేస్తున్నారు. వీటిని వాడటం వలన చర్మానికి ఎటువంటి హాని జరగదని చెబుతున్నారు.. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు తెలిపారు...

Conclusion:గిరిజనులను సమానంగా చూడటంతో పాటు వారికి అన్ని రంగాల్లోనూ అవకాశం కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు... ఎండ్ పి టు సి
బైట్స్1,2 గిరిజన మహిళలు
3.పద్మ జి సి సి డి ఎం
ఫ్రమ్...
శ్రీనివాస్ భద్రాచలం
లావణ్య ఈజెస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.