భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ అధికారులు.. పోడు భూముల సాగుదారుల మధ్య ఘర్షణ నెలకొంది. ములకలపల్లి మండలం గుట్టగూడెం గ్రామానికి చెందిన 120 కుటుంబాలు దాదాపు 3 వందల ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. 1990 నుంచి ఆ భూములనే జీవనాధారంగా చేసుకున్నారు.
ఇటీవల ఆ భూములు తమవే అంటూ ఫారెస్ట్ అధికారులు కోర్టుకెళ్లారు. న్యాయస్థానంలో తీర్పు అటవీశాఖకు అనుకూలంగా రాగా.. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. సాగుచేసిన పత్తి పంటను దున్ని... హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు పోలీసుల సాయంతో ప్రయత్నించారు. ఆగ్రహించిన పోడు భూమి సాగుదారులు తిరగబడ్డారు. కారం ఇసుకతో దాడి చేయగా... భద్రతగా వచ్చిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఫలితంగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదీచూడండి: రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు