భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. పూనెం సారయ్య, కుర్సిం మురళి, కాకా నాగేశ్వరరావు, కొమ్మురం సమ్మయ్యతో పాటు హనుమంతు నిషేధిత మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా ఉంటున్నారు. మావోయిస్టులకు కావాల్సిన నిత్యావసరాలను, సామగ్రిని సరఫరా చేస్తూ పట్టుపడ్డారు. హనుమంతు మరో వ్యక్తి దాముతో కలిసి గత నెల 29న తోగ్గూడెంలోని పలు క్వారీల్లోంచి పేలుడు పదార్థాలను చోరీ చేశారు. వాటిని వావోయిస్టులకు చేరవేసేందుకు సారయ్య, మురళి, నాగేశ్వరరావు, సమ్మయ్యలతో కలిసి రెండు ద్విచక్రవాహనాలు, టాటా మ్యాజిక్‌పై వెళ్తున్నారు.
అదే సమయంలో పాల్వంచ గ్రామీణం జగన్నాథపురం పెద్దమ్మగుడి సమీపంలో గ్రామీణ ఎస్సై శ్రీధర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరిని చూసిన హనుమంతు బృందం వేగంగా, అనుమానాస్పదంగా ముందుకెళ్లారు. పోలీసులు వారి వాహనాలను వెంబడించారు. ఒకరు పారిపోగా మిగిలిన ఐదుగురు పట్టుబడ్డారు. మావోయిస్టులు హరిభూషణ్, దామెదర్, లచ్చన్నకు పేలుడు పదార్థాలను అందజేసేందుకు వెళ్తున్నట్లు విచారణలో అగీకరించారు. వారి నుంచి 27 ఐడియల్ బూస్టర్స్, 40 జిలెటిన్‌స్టిక్స్, 40 డిటోనేటర్స్స టాటా మ్యాజిక్, రెండు ద్విచక్రవాహనాలు, 3 చరవాణులు, 57వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఓఎస్డీ రమణారెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: రైల్వే కాంట్రాక్టర్ ఆత్మహత్యలో వెలుగు చూసిన మరో కొత్తకోణం