11 రోజుల నుంచి దిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు నిరసన చేస్తుండగా... పోలీసులతో బాష్పవాయువు, వాటర్ స్ప్రేలతో కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా 250 రైతు సంఘాలు నిరసన దీక్ష చేస్తున్నాయని... చర్చల పేరిట రైతు ఉద్యమాన్ని నీరుగార్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించి రైతులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ డిసెంబర్ 8న జరిగే దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ, ఎంఎల్న్యూ డెమోక్రసీ, సీపీఎం, కాంగ్రెస్, తేదేపా నాయకులు ఎద్దులపల్లి సత్యం, సీతారామయ్య, కృష్ణ, నాయిని రాజు, తుపాకుల నాగేశ్వరరావు, పులి సైదులు, బంధం నాగయ్య, వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ నాగలక్ష్మి, శివ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతుల పోరాట పటిమకు వందనం.. బంద్‌లో పాల్గొంటం: కేసీఆర్