భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మామిడి గుండాల, కొమ్ముగూడెం నుంచి వచ్చిన రైతులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆఫీసుకు చేరుకున్నారు. మొక్కజొన్న పంటపై ప్రభుత్వ ఆంక్షలు సడలించాలని నినాదాలు చేశారు.
మొక్క జొన్నే పండిస్తాం.. సర్కార్ సహకరించాలి
మొక్కజొన్న పంట వేయొద్దని.. కంది, పత్తి మేలు రకాలనే పండించాలని చూపిస్తున్న భూములు ఆదివాసీ, గిరిజనులు వ్యవసాయం చేస్తున్న పోడు భూములు అనుకూలం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతులకు అనుకూలమైన మొక్కజొన్న పంటపై ప్రభుత్వ ఆంక్షలు తగవన్నారు. ఆంక్షలు తొలగించి పేద గిరిజన, ఆదివాసీ రైతులకు విత్తనాలు అందేలా చూడాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని తమ సంక్షేమార్థం సముచిత నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.