భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన గిరిజన రైతు పొడియం రమేష్ దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లుపై భద్రాచలం ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న పట్టా భూమిలో తనను వ్యవసాయం చేసుకోవద్దని అడ్డుకుంటున్నారని రైతు ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల నుంచి తన తండ్రిని, అన్నను, తనను పోలీస్ స్టేషన్కు పిలిపించి నిర్బంధించారని, బెదిరించి సంతకాలు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఏఎస్పీ ముందు వేడుకొన్నారు.
ఇవీ చూడండి: కాలుష్య కారాగారాలుగా మహానగర చెరువులు..!