భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా చేశారు. 29 నెలలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న వరవరరావు, 90 శాతం అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాలకు పూర్తిస్థాయి వైద్య చికిత్సలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు.
జైల్లో ఉన్న వరవరరావుకు కరోనా సోకడంపై అనుమానాలు ఉన్నాయని వెంటనే ఆయనకు పూర్తిస్థాయి చికిత్సలు నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పజెప్పాలని అధికారులను కోరారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి బెయిల్ రాకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని నర్సయ్య ఆరోపించారు. జైలులో ఉన్న వరవరరావుకు కరోనా సోకినందుకు అతన్ని విడుదల చేయాలని కోరారు.
ఇదీ చూడండి : ఎక్కడా ఎరువుల కొరతని వినిపించకూడదు : నిరంజన్ రెడ్డి