దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు లక్ష్మీ తాయారు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ముందుగా అర్చకులు లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం చేస్తున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక లక్ష కుంకుమార్చనలు చేస్తున్నామని తెలిపారు. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకళ్యాణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
దసరా వేడుకలు
రేపు అమ్మవారు నిజరూప అలంకాణంలో దర్శనమివ్వనున్నారు. దసరా సందర్భంగా దసరా మండపంలో అమ్మవారికి శమీ పూజ, ఆయుధ పూజ చేసి... సాయంత్రం శ్రీరామలీలా మహోత్సవం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.
ఇదీ చూడండి: Dussehra Sharan Navaratri 2021: భద్రాద్రిలో శరన్నవరాత్రి వేడుకలు.. వీరలక్ష్మీగా అమ్మవారి దర్శనం
Devi Sharan Navaratri 2021: భద్రాద్రిలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు