భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్( టీఐసీసీఐ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని పాల్గొని.. లబ్ధిదారులకు 25 ట్రాక్టర్లను అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం నిరుపేద గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని కోనేరు చిన్ని పేర్కొన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఇలాంటి కార్యక్రమం జరగడం అభినందనీయమన్నారు. దీనికి కృషి చేసిన భాజపా నాయకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టిక్కీ ఛైర్మన్ సుధాకర్, మహీంద్ర కంపెనీ జీఎం రామిరెడ్డి, హెచ్డీఎఫ్సీ జీఎం జలీల్, టిక్కీ కో-ఆర్డినేటర్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.