కొవిడ్ కష్టాలు కోతులకు సైతం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పలువురు జంతు ప్రేమికులు మేమున్నామంటూ వానరాలకు కూరగాయలు, పండ్లు వేస్తూ వాటి ఆకలిని తీర్చుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారుల్లో వానరాల కోసం జంతు ప్రేమికులు ఆహార పదార్థాలు, కూరగాయలు నిత్యం అందజేస్తున్నారు.
ఆ ప్రాంతంలో అడవులు ఉన్నప్పటికీ ఎటువంటి పండ్ల చెట్లు లేకపోవడం వల్ల కోతులు రోడ్లపైకి వచ్చి ఇరువైపులా దీనంగా చూస్తున్నాయి. పరిస్థితులను గమనించిన పలువరు జంతు ప్రేమికులు తరచూ కోతులకు కూరగాయలు, పండ్లను వేస్తూ వాటి ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లాక్‌డౌన్(Lock down) కారణంగా తక్కువ వాహనాలు మాత్రమే ఆ ప్రాంతంలో ప్రయాణించడం వల్ల వానరాలకు ఆహారం దొరికేది కాదు.
ఇదీ చూడండి: Corona Effect: కరోనా వచ్చిందని బాత్రూంలో క్వారంటైన్..