భద్రాచలం శాసనసభ్యుడు పొదెం వీరయ్యపై ఉన్న కేసును ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టారన్న ఆరోపణలతో భద్రాచలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు తగిన సాక్ష్యాధారాలు లేదని వ్యాఖ్యానించింది. భద్రాచలం పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రంపై విచారణ జరిపిన హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు.. పొదెం వీరయ్యపై ఉన్న కేసు కొట్టివేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో కేవలం మూడు నెలల్లోనే ఆయనపై ఉన్న మొత్తం 11 కేసులు వీగిపోయాయి.