ETV Bharat / state

రామునికి భక్తితో... భక్తుడి హంస వాహనాలు

భక్తి పలు విధాలు.. కానీ ఇతనికి ఉన్న భక్తి ఏకంగా రాముని కోసం ప్రతియేటా తనకు వచ్చిన కళతో హంస వాహనాలు తయారుచేస్తున్నాడు.. నాలుగేళ్లుగా భద్రాద్రి రాముడు కొలువై ఉన్న సారపాకలో తెప్పోత్సవం జరుపుతున్నానని చెబుతున్నాడు.

Devotion to Lord Rama at badrachalam
రామునికి భక్తితో... భక్తుడి హంస వాహనాలు
author img

By

Published : Jan 3, 2020, 2:39 PM IST

నీలి మేఘశ్యాముడు భద్రాద్రి రాముడు కొలువై ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ భక్తుడు తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. దేవునిపై ఉన్న భక్తితో తనకు తెలిసిన కళా నైపుణ్యంతో హంస వాహనాలు తయారుచేస్తున్నాడు. ప్రతియేటా శ్రీ సీతారామచంద్ర స్వామికి ముక్కోటి ఏకాదశి ముందు రోజు గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవానికి ప్రత్యేకంగా లాంచీని తీసుకువచ్చి హంస వాహనంగా తయారుచేస్తారు. రాముడిని అందులో కూర్చుండబెట్టి విహరింప జేస్తారు.

హంస వాహనాన్ని తయారుచేశాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన పాలమని రామకృష్ణ గతంలో పెయింటింగ్​ కళాకారునిగా పనిచేశాడు. ప్రస్తుతం పెయింటింగ్​కు ఆదరణ లేకపోవడం వల్ల చిన్న ద్విచక్రవాహనంపై చరవాణి కవర్లను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రామునిపై ఉన్న భక్తితో గోదావరి నదిలో ఎలాగైతే హంస వాహనంపై స్వామి వారు విహరిస్తారో, అదే విధంగా ఇతను ధర్మకోల్ షీట్లతో హంస వాహనాన్ని తయారుచేశాడు. భద్రాద్రిలో ఈ నెల 5న గోదావరి నదిలో తెప్పోత్సవం జరగనుంది. ఇతను కూడా బ్రిడ్జి సెంటర్​లో తన చరవాణి దుకాణం పక్కన చిన్న నీటి కుంటను ఏర్పాటు చేసి అందులో హంస వాహనాన్ని నడుపు తానని చెబుతున్నాడు.

గత నాలుగేళ్లుగా సారపాకలో తెప్పోత్సవం రోజున ఇలాగే చిన్న హంస వాహనాన్ని తయారుచేసి నీటి కుంటలో తిప్పుతానని చెబుతున్నాడు. తనకు సీతారాములంటే భక్తి అని, ప్రతియేటా రామ మాల దీక్ష చేపడతానని, దేవునిపై భక్తితోనే భద్రాచలంలో తెప్పోత్సవం జరిగే రోజు ఇలా భక్తి భావం చాటుకుంటున్నానని చెబుతున్నాడు.

రామునికి భక్తితో... భక్తుడి హంస వాహనాలు

ఇదీ చూడండి : వనదేవతలను దర్శించుకున్న మంత్రులు

Intro:నీలి మేఘ శ్యాముడు భద్రాద్రి రాముడు కొలువై ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ భక్తుడు తన భక్తి భావాన్ని చాటుకున్నాడు దేవుని పై ఉన్న భక్తితో తనకు తెలిసిన ఆర్టిస్ట్ నైపుణ్యంతో చిన్న హంస వాహనాన్ని తయారు చేశాడు ప్రతియేటా జనవరి నెలలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ముక్కోటి ఏకాదశి ముందు రోజు గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా లాంచీ ని తీసుకువచ్చి హంస వాహనంగా తయారుచేసి రామయ్య తండ్రి ని కూర్చుండబెట్టి విహరింప చేస్తారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన పాల మని రామకృష్ణ గతంలో ఆర్టిస్ట్ గా పనిచేశాడు ప్రస్తుతం పెయింటింగ్ కు ఆదరణ లేకపోవడంతో చిన్న ద్విచక్రవాహనంపై చరవాణి కవర్లను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు

Body:అయితే భద్రాద్రి రాముని పై ఉన్న భక్తితో గోదావరి నదిలో ఎలాగైతే హంస వాహనంపై స్వామి వారు విహరిస్తారో అదే విధంగా ఇతను ధర్మకోల్ షీట్లతో హంస వాహనాన్ని తయారుచేశాడు భద్రాద్రిలో ఈ నెల 5న గోదావరి నదిలో తెప్పోత్సవం జరగనున్నందున ఇతను కూడా బ్రిడ్జి సెంటర్ లోని ఫుట్ పాత్ మీద ఉన్న తన చరవాణి దుకాణం పక్కన చిన్న నీటి కుంటను ఏర్పాటు చేసి అందులో హంస వాహనాన్ని నడుపు తానని అని చెబుతున్నాడు గత నాలుగేళ్లుగా సారపాక లో తెప్పోత్సవం రోజున ఇలాగే చిన్న హంస వాహనాన్ని తయారుచేసి నీటి కుంటలో తిప్పుతానని చెబుతున్నాడు

Conclusion:తనకు సీతారాములు అంటే భక్తి అని ప్రతియేటా రామ మాల దీక్ష చేపడతానని దేవుని పై ఉన్న భక్తితోనే భద్రాచలంలో తెప్పోత్సవం జరిగే రోజు ఇలాగా భక్తి భావం చాటుకుంటున్నానని చెబుతున్నాడు. బైట్. రామకృష్ణ భక్తుడు భద్రాచలం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.