bhadradri temple: భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి శుభ ఘడియలు దగ్గరపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల నుంచి గోటితో ఒలిచిన తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు భక్తులు తరలివచ్చారు.
గురువారంనాడు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, పెద్ద కొండూరు గ్రామానికి చెందిన భక్తులు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలు సమర్పించారు. గ్రామంలో పండిన వరి ధాన్యాన్ని సేకరించి రెండు నెలలుగా భక్తిశ్రద్ధలతో గోటితో ఒలిచి తలంబ్రాలను తయారు చేశారు. ఈ విధంగా తలంబ్రాలను సమర్పించడం స్వామి వారికి సేవ చేసినట్లుగా భావిస్తున్నామని వారు తెలిపారు.
ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు
కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్ల వద్దకు చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. తలంబ్రాల కోసం ఆర్టీసీ కార్గో పార్శిల్ బుకింగ్ కేంద్రాల్లో రూ.80 చెల్లించి చిరునామా నమోదు చేసుకోవాలని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు బుధవారం తెలిపారు.
ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు , 10న సీతారాముల కల్యాణం...11న రామ పట్టాభిషేక మహోత్సవం జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గోటితో ఒలిచిన తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు భక్తులు తరలివచ్చారు.
ఇదీ చదవండి: వంట నూనెలు, గింజల నిల్వలపై ఆంక్షల పొడిగింపు