భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీతాయారు అమ్మవారు రోజుకు ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు.
ఉత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహానివేదన చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం అమ్మవారి ఆలయం ఎదురుగా రామయ్య తండ్రికి దర్బార్ సేవ జరపనున్నారు. అనంతరం మహా మంత్రపుష్పం వేడుక జరగనుంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రేపు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇదీ చూడండి: చంద్ర ఘంట అలంకారంలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబాదేవి