భద్రాద్రి రామయ్య సన్నిధిలోని శ్రీ లక్ష్మీ తాయారమ్మ ఉపాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజున అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ధనాభివృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం సహస్ర కుంకుమపూజ, అష్టోత్తర శతనామావళి పారాయణం జరుపుతున్నారు. సాయంత్రం మహా మంత్ర పుష్పం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కదిలి వస్తున్నారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..